తాజాగా హర్ష సాయిపై కేసు విషయంతో వార్తల్లో నిలిచిన మిత్రా శర్మ, గతంలో నటిగా, నిర్మాతగా వ్యవహరించిన ‘వర్జిన్ బాయ్స్’ సినిమాతో మరోసారి దృష్టిని ఆకర్షిస్తోంది. చాలా కాలం క్రితం పూర్తయిన ఈ చిత్రం ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఈ సమ్మర్ సీజన్‌లో ప్రేక్షకులకు హాస్య రసాన్ని పంచేందుకు రొమాంటిక్ కామెడీ జోనర్‌లో రూపొందిన ‘వర్జిన్ బాయ్స్’ సినిమా రాజ్ గురు ఫిలిమ్స్ బ్యానర్‌పై రాజా దరపునేని నిర్మాణంలో, దయానంద్ దర్శకత్వంలో తెరకెక్కింది. గీతానంద్, మిత్రా శర్మ హీరో హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ చిత్రం యువతను ఆకట్టుకునే కథనంతో సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. స్మరణ్ సాయి, మార్తాండ్ కె వెంకటేష్, వెంకట ప్రసాద్ వంటి సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు బలం చేకూర్చారు.
Samantha : Xలోకి రీ ఎంట్రీ ఇచ్చిన సమంత.. ఏం పోస్టు చేసిందంటే..?
సినిమా పోస్టర్‌ను చూస్తే దీని హాస్య శైలి స్పష్టంగా అర్థమవుతుంది. ఒక అందమైన యువతి ముఖంపై ఆమె పెదవుల చుట్టూ ముగ్గురు యువకులు విభిన్న రూపాల్లో కనిపించడం ఆకర్షణీయంగా ఉంది. ఒకరు రంగురంగుల షార్ట్స్‌లో, మరొకరు స్కేట్‌బోర్డ్‌తో, ఇంకొకరు మ్యాగజైన్ చేతిలో పట్టుకుని నవ్వుతూ కనిపిస్తున్న ఈ పోస్టర్ క్రేజీ వైబ్స్‌ను అందిస్తోంది. ‘బ్రో.. ఆర్ యు వర్జిన్?’ అనే ట్యాగ్‌లైన్ యువతలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రం రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్నట్లు సమాచారం. భారీ ప్రమోషన్‌లతో సమ్మర్‌లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. యువత మధ్య సాగే ప్రేమ, హాస్యం, భావోద్వేగాల కలబోతగా రూపొందిన ఈ చిత్రం థియేటర్లలో ఉత్సాహాన్ని నింపనుంది. పోస్టర్ అంచనాలను పెంచడమే కాకుండా, ఈ సినిమా భారీ విజయం సాధించే సూచనలను ఇస్తోంది. త్వరలో విడుదల తేదీపై స్పష్టత రానుంది.