టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ మాట్లాడుతూ.. వన్డేల్లో 52 సెంచరీలు, 14 వేలకు పైగా పరుగులతో పాటు టెస్టుల్లోనూ 32 శతకాలు, ఇప్పటికే వేలకు వేలు పరుగులు రాబట్టాడు అని పేర్కొన్నాడు. అలాంటి ప్లేయర్ వరుసగా రెండుసార్లు డకౌట్ అయినంత మాత్రాన తప్పుపట్టాల్సిన అవసరం ఏం లేదన్నారు. అతడిలో ఇంకా చాలా ఆట మిగిలే ఉంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో విరాట్ కోహ్లీ ఒకడు. ముందు బ్యాటింగ్ చేసినా.. ఛేజింగ్ అయినా.. పిచ్ ఏదైనా.. బౌలర్ ఎవరైనా పరుగుల వరద పారిస్తున్నాడు. ఇప్పటివరకు 252 ఐపీఎల్ మ్యాచ్‌లలో 8,004 పరుగులు చేయగా.. ఇందులో 8 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గత 17 సంవత్సరాలుగా ఒకే ఫ్రాంచైజీకి నిలకడగా ఆడుతున్న ఏకైక ప్లేయర్ కూడా కోహ్లీనే. ఐపీఎల్ 2025 మార్చ్ 22 నుంచి ఆరంభం కానుండగా.. విరాట్…