ఇండిగో విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా ఏర్పడిన గందరగోళాన్ని నెటిజన్లు తమదైన శైలిలో సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఓ నెటిజన్ ఇండిగో విమానం థీమ్‌లో రూపొందించిన ఆటో వెర్షన్‌ను AI సహాయంతో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోలో కనిపించే ఆటో నీలం, తెలుపు రంగులతో అచ్చం ఇండిగో స్టైల్‌లో రూపుదిద్దుకుంది. బయటకు విమానం రెక్కల్లా కనిపించే డిజైన్‌లు, పక్కగా ఇంజిన్‌లా స్టైల్ చేసిన…