తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం నాడు వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈరోజు అర్ధరాత్రి 12 గంటల తర్వాత నిత్యసేవలు, కైంకర్యాల అనంతరం వేకువజామున 1:45 గంటలకు వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం కానుంది. తొలుత ప్రొటోకాల్ పరిధిలోని వీఐపీలను శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. ఈ నేపథ్యంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం పలువురు వీఐపీలు తిరుమలకు వస్తున్నారు. మొత్తం 11 మంది మంత్రులు వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమలకు రానున్నట్లు టీటీడీ అధికారులు…
కలియుగ వైకుంఠం తిరుమలకు భక్తుల తాకిడి పెరుగుతోంది. కరోనా నుంచి దేశం కోలుకుంటోంది. దీంతో స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చేవారు పెరుగుతున్నారు. కొండపై వీఐపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల తాకిడి కూడా ఎక్కువగానే వుంది. నవంబర్ 13,14,15వ తేదీలలో శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. 14వ తేదీన తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు జరుగుతోంది. ఈ సదస్సుకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా వస్తున్నారు. వీఐపీల తాకిడి కారణంగా బ్రేక్ దర్శనాలు, సిఫార్సు…