మాస్ మహారాజా రవితేజ అభిమానులతో పాటు, తెలుగు సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'మాస్ జాతర' చిత్రం అక్టోబర్ 31, 2025న విడుదల కానుంది. ఈ మేరకు నిర్మాతలు అధికారికంగా ప్రకటించి, అభిమానులకు అసలైన పండుగ వార్త అందించారు. వింటేజ్ వైబ్స్, పక్కా కమర్షియల్ అంశాలతో ఈ సినిమా థియేటర్లలో అసలుసిసలైన మాస్ పండుగను తీసుకురాబోతోంది అని మేకర్స్ చెబుతున్నారు. మాస్ మహారాజా రవితేజను వింటేజ్ రవితేజ చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.