మాస్ మహారాజా రవితేజ అభిమానులతో పాటు, తెలుగు సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘మాస్ జాతర’ చిత్రం అక్టోబర్ 31, 2025న విడుదల కానుంది. ఈ మేరకు నిర్మాతలు అధికారికంగా ప్రకటించి, అభిమానులకు అసలైన పండుగ వార్త అందించారు. వింటేజ్ వైబ్స్, పక్కా కమర్షియల్ అంశాలతో ఈ సినిమా థియేటర్లలో అసలుసిసలైన మాస్ పండుగను తీసుకురాబోతోంది అని మేకర్స్ చెబుతున్నారు. మాస్ మహారాజా రవితేజను వింటేజ్ రవితేజ చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.
READ MORE:Dussehra 2025: రేపే దసరా.. ఇలా పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది.. శని దోషం పోతుంది..!
కొత్త విడుదల తేదీ ప్రకటన సందర్భంగా చిత్ర బృందం రవితేజ, హైపర్ ఆదిలపై చిత్రీకరించిన ఒక సరదా వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో హైపర్ ఆది 2025 సంక్రాంతి, వేసవి సెలవులు, వినాయక చవితి అంటూ పలుసార్లు సినిమా వాయిదా పడటాన్ని సరదాగా ఎగతాళి చేయగా, ఆలస్యానికి గల కారణాలపై రవితేజ అంతే చమత్కారంగా స్పందించారు. ఈ చిత్రంలో రవితేజకు జోడీగా శ్రీలీల కథానాయికగా నటిస్తున్నారు. రవితేజ-శ్రీలీల జోడి అంటే ప్రేక్షకులలో ప్రత్యేకమైన అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ జోడి మరోసారి బాక్సాఫీస్ వద్ద మెరుపులు మెరిపించడానికి సిద్ధమవుతోంది అంటున్నారు మేకర్స్. సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు భాను భోగవరపు మాస్ ప్రేక్షకులతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా మెచ్చే విధంగా వాణిజ్య అంశాలతో ‘మాస్ జాతర’ను అసలైన పండుగ సినిమాగా తీర్చిదిద్దుతున్నారని అంటోంది టీం.