కృష్ణ హీరోగా విజయ నిర్మల తెరకెక్కించిన 'అంతం కాదిది ఆరంభం' పేరుతో మరో సినిమా త్వరలో తెలుగువారి ముందుకు రాబోతోంది. ఈ కథకు ఈ టైటిల్ సూట్ అవుతుందని అందుకే ఆ పేరు పెట్టామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ఈ మూవీ మోషన్ పోస్టర్ ను ప్రముఖ దర్శకుడు దశరథ్ ఆవిష్కరించారు.
ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ శిష్యుడు ముని సహేకర డైరెక్టర్ గా పరిచయం అవుతున్న సినిమా 'మెకానిక్'. ఈ మూవీ మోషన్ పోస్టర్ ను ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు ఆవిష్కరించారు.