Mechanic: మణి సాయి తేజ టైటిల్ రోల్ ప్లే చేసిన చిత్రం ‘మెకానిక్’. ట్రబుల్ షూటర్ దీని ట్యాగ్ లైన్. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ శిష్యుడైన ముని సహేకర ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రాన్ని ఎమ్. నాగ మునెయ్య (మున్నా) నిర్మిస్తున్నారు. కొండ్రాసి ఉపేందర్, నందిపాటి శ్రీధర్ రెడ్డి సహ నిర్మాతలు. ఈ సినిమా మోషన్ పోస్టర్ ను ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు ‘దిల్’ రాజు విడుదల చేసి, చిత్ర బృందాన్ని అభినందించారు. ఎంతో బిజీషెడ్యూల్ లో ఉన్న కూడా ‘దిల్’ రాజు తన విలువైన సమయాన్ని తమకోసం వెచ్చించారని, అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నామని దర్శక నిర్మాతలు చెప్పారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ వినోదాత్మక ప్రేమకథా చిత్రంలో ఓ చక్కని సందేశానికీ చోటు కల్పించామని, మణిసాయి తేజ సరసన రేఖ నిరోషా హీరోయిన్ గా నటించిందని నిర్మాత మున్నా తెలిపారు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తయిన ‘మెకానిక్’ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. వినోద్ యాజమాన్య సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రంలో భరణి, నాగమహేశ్, సమ్మెట గాంధీ, వీరశంకర్, కిరిటీ దామరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు.