దేశంలో జనాభా పెరిగిపోతుండటంతో నగరీకరణ పెరుగుతున్నది. ఫలితంగా రోడ్లపై ట్రాఫిక్ భారీగా పెరుగుతున్నది. కిలోమీటర్ దూరం ప్రయాణానికి గంటల సమయం పడుతున్నది. ఇక అంబులెన్స్ వంటి వాహనాలు ట్రాఫిక్‌లో ఇరుక్కుంటే పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పాల్సిన అవసరం లేదు. ఎగిరిపోయే కార్లు వస్తే ఎంత బాగుంటుంది అనిపిస్తుంటుంది. అలాంటి ఎగిరే కార్లు త్వరలోనే దేశంలో అందుబాటులోకి రాబోతున్నాయి. ఆసియాలోనే మొదటి ఎగిరే కారు ఇండియాలోనే తయారు కాబోతున్నది. ఇండియన్ స్టార్టప్ సంస్థ వినతా ఏరోమొబిలిటీ ఆఫ్ ఇండియా…