రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పిల్లి పల్లి అనే గ్రామంలో చిరుత సంచరిస్తునట్టు సమాచారం వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చామన్నారు ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణా రెడ్డి. ఇప్పటికే చుట్టుపక్కల గ్రామ ప్రజలను అలెర్ట్ చేసామన్నారు. రాత్రి సమయంలో ఊరిలో చాటింపు వేసి ఇళ్ల నుండి ప్రజలను బయటికి రావొద్దు అని చెప్తున్నాం.. రాత్రి సమయంలో పెట్రోలింగ్ వెహికిల్స్ ను ఉంచామన్నారు. చిరుత కనిపిస్తే వెంటనే డయల్100 కి కాల్ చేయాలి…
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ జిల్లాల్లో అటవీ ప్రాంతాలకు సమీపంలోని గ్రామాల్లో పులులు, చిరుత పులులు భయాందోళనలు కలిగిస్తున్నాయి. కొమురం భీం జిల్లా దహెగాం మండలం ఖర్జీ అటవీ ప్రాంతంలో మేకలమందపై పులి దాడి చేసింది. దీంతో భయభ్రాంతులకు గురైన కాపరి మహేష్ చెట్టుపైకి ఎక్కి గ్రామస్తులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. అనంతరం ఎఫ్బీఓలు మధుకర్, రమేష్, రాకేష్, గ్రామస్తులు వెళ్లి ఘటన స్థలాన్ని పరిశీలించారు. పులి అడవి పందిని తింటుండగా మేకల మంద రావడంతో…