Lakshya Sen In Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ లో భారత బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ తీవ్ర నిరాశ పరిచాడు. బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో విభాగంలో సెమీ ఫైనల్స్‌లో ప్రపంచ నెంబర్ 2 ర్యాంకర్, డెన్మార్క్ ఆటగాడు విక్టర్ అక్సెల్సెన్ చేతిలో ఓటమిని చవిచూశాడు. దీంతో కాంస్య పతకం కోసం లక్ష్యసేన్ మరో మ్యాచ్ ఆడనున్నారు.
ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ షట్లర్ లక్ష్యసేన్‌కు నిరాశ ఎదురైంది. 10-21, 15-21 తేడాతో టాప్‌సీడ్ విక్టర్ అక్సెల్సెన్ చేతిలో ఓటమిపాలయ్యాడు. 53 నిమిషాల పాటు జరిగిన తుది పోరులో అక్సెల్‌సెన్‌కు దీటైన పోటీనివ్వడంలో విఫలమయ్యాడు. ఇటీవల జరగిన జర్మనీ ఓపెన్‌లో ఈ డెన్మార్క్ షట్లర్‌ను మట్టికరిపించిన సేన్.. మరోమారు ఆ స్థాయి ప్రదర్శన కనబరుస్తాడని ఆందరూ ఊహించారు. కానీ, అక్సెల్‌సన్ ఎక్కడా అవకాశమివ్వకుండా చెలరేగాడు. తన అనుభవన్నంతా రంగరిస్తూ డ్రాప్ షాట్లు, పదునైన స్మాష్‌లతో…