Flood Alert: తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో జోరుగా వర్షం కురుస్తుంది. ముఖ్యంగా వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో కురిసిన కుండపోత వర్షం కారణంగా వాగులు, వంకలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. దీంతో ఈ రెండు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ప్రజల్లో రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు ముప్పు పొంచి ఉందనే ఆందోళన మొదలైంది. భారీ వర్షం ధాటికి మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో నగర పరిసర ప్రాంతాలకు ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి. వికారాబాద్ జిల్లాలోని గొట్టిముక్కల వద్ద…