అక్కడ కాంగ్రెస్ పార్టీలో మూడు ముక్కలాట జోరుగా నడుస్తోందా? ఓ కాంగ్రెస్, బీ కాంగ్రెస్ అంటూ వర్గాలుగా విడిపోయి తన్నుకుని తలంట్లు పోసుకుంటున్నారా? చివరికి పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశాన్నే రసాభాస చేసుకున్నారా? ఆ యుద్ధం అసలు అధిష్టానం చెక్ పెట్టగలిగే స్థాయిలో ఉందా? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? మూడు ముక్కలాట ఆడుతున్న ఆ నాయకులెవరు? వికారాబాద్ జిల్లా అధికార పార్టీలో నేతల మధ్య ఐక్యత లోపించింది. ఇక్కడ అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే…