ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 38వ డివిజన్ రథం సెంటర్ నుంచి చిట్టినగర్ వరకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షైక్ అసిఫ్ ఆధ్వర్యంలో రోడ్డు షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈరోజు తాను వైసీపీ ముఖ్య నాయకులు అందరం కలిసి రోడ్డు షో నిర్వహించామని.. ప్రజల దగ్గర నుంచి మంచి స్పందన వస్తుందని తెలిపారు. తప్పకుండా.. వైసీపీ ఎమ్మెల్యే…
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో ఎన్నికలు లోకల్‌కి, నాన్‌లోకల్‌కి మధ్య జరుగుతున్నాయని కేశినేని శ్వేత అన్నారు. ఇక్కడ పోటీ చేసే అభ్యర్థికి కనీసం ఓటు హక్కు కూడా లేదని విమర్శించారు. పొలిటికల్ టూరిజం కోసం ఆంధ్ర రాష్టం మీద పడుతున్నారని ఎద్దేవా చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 35, 42వ డివిజన్లలో తన తండ్రి కేశినేని నాని తరఫున కేశినేని శ్వేత ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ ఎమ్మె్ల్యే అభ్యర్థి సుజనా చౌదరి సమక్షంలో వైసీపీ సీనియర్ నాయకులు, మాజీ కనకదుర్గ టెంపుల్ చైర్మన్ పైలా సోమి నాయుడు ఈరోజు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ.. సొంత జిల్లా నుంచి పోటీ చేయడం అదృష్టంగా భావిస్తానని తెలిపారు. దేశ రాష్ట్ర రాజకీయాలను చూశా... ప్రపంచం మొత్తం తిరిగానన్నారు. కృష్ణా జిల్లా నా పుట్టినిల్లు.. విజయవాడ వెస్ట్ అభ్యర్థిగా బరిలో దిగడాన్ని భగవంతుడి వరంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.…
Kesineni Nani: నిన్నటి నిన్నే టీడీపీ అధిష్టానంపై బహిరంగంగా సంచలన వ్యాఖ్యలు చేసిన బెజవాడ ఎంపీ కేశినేని నాని.. అదే దూకుడు చూపిస్తున్నారు.. ఓవైపు ఇతర పార్టీల నేతలను టీడీపీలోకి ఆహ్వానిస్తూనే.. కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.. ఇవాళ విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి పలువురు వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు.. ఎంపీ కేశినేని నాని సమక్షంలో వారు టీడీపీ కండువా కప్పుకున్నారు.. ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి రాజకీయ చైతన్యం ఎక్కువ…