దేశంలోనే సీ ప్లేన్ తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రారంభం అన్నారు కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు.. కొన్ని మార్గదర్శకాలు మార్చి సామాన్యులకు అందుబాటు ధరలో ఉండేట్లు స్కీం ను రూపొందిస్తున్నాం అన్నారు.. ఎయిర్ పోర్ట్ కట్టాలంటే కనీసం 500 ఎకరాల అవసరం లేకుండా వాటర్ ఏరో డ్రోమ్స్ సహాయంతో ఎయిర్ ట్రావెల్ కు అవకాశం ఉందన్నారు.. ఉడాన్ స్కీం ద్వారా వయబిలిటీ గ్యాప్ ఫండ్ కూడా ఉంది.. టూరిజం కూడా సహకరిస్తే ఇంకా…
ఇవాళ ఉదయం విజయవాడ పున్నమి ఘాట్ వద్ద సీ ప్లేన్ ట్రయల్ రన్ ను సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు.. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి, పర్యాటక శాఖామంత్రి, ఇతర స్ధానిక ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొంటారు.. పున్నమి ఘాట్ నుంచి సీఎం చంద్రబాబు సీ ప్లేన్ లో ప్రయాణిస్తారు.. సీ ప్లేన్ లో విజయవాడ నుంచి శ్రీశైలం చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు..
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలో తొలి సీప్లేన్ సర్వీసులకు వేదికకా మారనుంది విజయవాడ.. ఇప్పటికే డీ హావిలాండ్ ట్విన్ అట్టర్ క్లాసిక్ 300 విమానం భారత్‌కు చేరుకోగా... నేడు శ్రీశైలం నుంచి విజయవాడ వరకు సీ ప్లేన్ ట్రయల్ రన్ నిర్వహించనున్నారు..