గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ బుధవారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. వివిధ కేసుల్లో ఆయన 138 రోజులుగా విజయవాడ సబ్‌జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
రేపు వల్లభనేని వంశీని పరామర్శించనున్నారు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. విజయవాడ జిల్లా జైలులో కిడ్నాప్ కేసులో రిమాండ్ లో ఉన్న వల్లభనేని వంశీని ఆయన రేపు కలుస్తారు.. ఇప్పటికే వంశీ భార్య పంకజశ్రీని ఫోన్‌లో పరామర్శించిన జగన్.. ఆమెకు భరోసా ఇచ్చారు.. వంశీ అరెస్ట్ రోజు జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు..