గుండెపోటుతో హఠాన్మరణం పొందిన సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను నిర్వహించారు. అంతిమ సంస్కారాలకు సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు హాజరై నివాళులు అర్పించారు.
సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ హఠాన్మరణంపై ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలంగా రాష్ట్రంలో పోలీసు విభాగానికి ఆయన అందించిన విశిష్టమైన సేవలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.