‘విరాటపర్వం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా విచ్చేసిన విక్టరీ వెంకటేశ్.. తనకు సినిమాలంటే ఎంతో గౌరవమని, విరాటపర్వం లాంటి సినిమాలు మరిన్ని రావాలని కోరుకుంటున్నానని, అందుకే తాను ఈ ఈవెంట్‌కి వచ్చానని అన్నారు. అనంతరం విరాటపర్వంలోని ఓ డైలాగ్ చెప్పి వేదికని ఉర్రూతలూగించిన వెంకటేశ్.. రానాపై పొగడ్తల వర్షం కురిపించారు. లీడర్ నుంచి రానా ప్రతీ పాత్రను చాలా సిన్సియర్‌గా పోషిస్తున్నాడని, సినీ ప్రియులూ అతడ్ని ఆదరిస్తున్నారని, అతని పాత్రల్ని మెచ్చుకుంటున్నారని, అందుకు తనకు చాలా సంతోషంగా…
”ఎఫ్ 2 పెద్ద విజయం సాధించింది. ఆ సినిమాని, అందులో పాత్రలని ప్రేక్షకులంతా ఎంతో అభిమానించారు. ఎఫ్ 3 నుండి ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ వినోదం కోరుకుంటారు. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఎఫ్ 2కి ట్రిపుల్ డోస్ వినోదం ఎఫ్ 3లో వుంటుంది” అన్నారు హీరో విక్టరీ వెంకటేష్ . విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సూపర్ హిట్…