జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నలుగురు నిందితులు పోలీసు కస్టడీలో ఉండగా, మరో ఇద్దరు నిందితుల కస్టడీకి కూడా కోర్టు అనుమతించింది. దీంతో ఇవాళ (శనివారం) ఆరుగురు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు విచారించనున్నారు. కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మాలిక్‌ను ఇప్పటికే కస్టడీలో రెండు రోజులు విచారించగా, నేడు మూడవ రోజు కూడా విచారణ సాగనుంది. ముగ్గురు మైనర్ నిందితులను రెండవరోజైన శనివారం కూడా విచారిస్తారు. మిగిలిన ఇద్దరు నిందితులను ఈ రోజు నుంచి విచారిస్తారు.…