Jubilee Hills Rape Case: మొత్తం ఆరుగురు.. మూడో రోజు సాదుద్దీన్ విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నలుగురు నిందితులు పోలీసు కస్టడీలో ఉండగా, మరో ఇద్దరు నిందితుల కస్టడీకి కూడా కోర్టు అనుమతించింది. దీంతో ఇవాళ (శనివారం) ఆరుగురు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు విచారించనున్నారు. కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మాలిక్‌ను ఇప్పటికే కస్టడీలో రెండు రోజులు విచారించగా, నేడు మూడవ రోజు కూడా విచారణ సాగనుంది.
ముగ్గురు మైనర్ నిందితులను రెండవరోజైన శనివారం కూడా విచారిస్తారు. మిగిలిన ఇద్దరు నిందితులను ఈ రోజు నుంచి విచారిస్తారు. నిందితులకు కోర్టు ఐదు రోజుల కస్టడీ విధించింది. అయితే, జువైనల్ హోమ్‌లో విచారించేందుకు సరైన ఏర్పాట్లు చేయలేమని, ఈ విషయంలో కోర్టు ఆదేశాలు తమకు వర్తించవని జువైనెల్ హోమ్ అధికారులు తెలిపారు. దీంతో పోలీసులు ఐదుగురు మైనర్ నిందితులను తమ కస్టడీలోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణ జరుపుతారు. మైనర్ నిందితులకు ప్రభుత్వ వైద్యులతో పొటెన్సీ టెస్ట్ చేయించాలని పోలీసులు భావిస్తున్నారు.
Also Read
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
- Alwal Case: అల్వాల్ మైనర్ బాలిక సామూహిక లైంగిక దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్..
- CM Revanth Reddy : రేపు సీఎం రేవంత్ టూర్.. కరీంనగర్, సిరిసిల్లలో భారీ కార్యక్రమాలు
ఈ కేసులో చార్జిషీటు వేయాలంటే పొటెన్సీ టెస్టు చేయించడం తప్పనిసరి. అందుకే ఈ టెస్టు చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మైనర్ నిందితులను ఐడెంటిఫికేషన్ టెస్ట్ చేయించనున్నారు. నిందితుల్లో ఎమ్మెల్యే కొడుకు, కార్పొరేటర్ కొడుకు, వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు, మాజీ ఎమ్మెల్యే మనవడితోపాటు, మరో ఇద్దరు మైనర్స్ ఉన్నారు. మొత్తం ఆరుగురుని జూబ్లీహిల్స్ పోలీస్టేషన్ లో విచారించే అవకాశం వుంది. అనంతరం విడివిడిగా నిందితులను విచారించి, ఆ తరువాత నిందితులందరిని కలిపి విచారించనున్నారు దర్యాప్తు అధికారులు.
అయితే.. నిన్న (జూన్ 10)న జూబ్లీహిల్స్ అమ్నీషియా మైనర్ బాలికపై సామూహిక లైంగిక దాడి ఘటనలో బాధితురాలి మెడికల్ రిపోర్టును వైద్యులు.. పోలీసులకు అందించారు. కాగా, మెడికల్ రిపోర్ట్ ప్రకారం.. లైంగిక దాడి జరిగే సమయంలో మైనర్ మెడపై నిందితులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడినట్టు వెల్లడైంది.
ఆ సమయంలో మైనర్.. లైంగిక దాడికి నిరాకరించడంతో నిందితులు ఆమెపై గోళ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో మైనర్ శరీరంపై 12 గాయాలు ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. ఇదిలా ఉండగా.. ఈ కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మాలిక్‌ను మూడోరోజు పోలీసులు విచారిస్తున్నారు. మరి ఈవిచారణలో ఏ1 నిందితుడు సాదుద్దీన్ సమగ్ర విచారణలో ఎలాంటి విషయాలు బయట పెట్టనున్నాడో ప్రతి ఒక్కిరు ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజావార్తలు
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
-
CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
ట్రెండింగ్
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?