Sadhvi Prachi On Swara Bhasker Marriage: బాలీవుడ్ నటి స్వరాభాస్కర్ ఇటీవల సమాజ్ వాదీ పార్టీ నేత ముస్లిం అయిన ఫహద్ అహ్మద్ ను పెళ్లి చేసుకుంది. దీనిపై ఇటు హిందూ, అటు ముస్లిం వర్గాల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కొంత మంది ముస్లిం మతపెద్దలు ఈ వివాహాన్ని తప్పుబట్టారు. ఇదిలా ఉంటే హిందూ నేతలు కూడా స్వరా తీరును విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ వివాహం గురించి విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ) నాయకురాలు సాధ్వీ…
Boycott on Muslim traders in Karnataka temple fair: కర్ణాటకలో మరో వివాదం రాజుకుంది. దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలోని శ్రీ మహాలింగేశ్వర ఆలయ ప్రాంగణంలో హిందువులు మాత్రమే వ్యాపారం చేయాలని విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) మరో వర్గం వారికి వార్నింగ్ ఇస్తోంది. దీనికి సంబంధించి ఆలయ పరిసరాల్లో ఓ పోస్టర్ కూడా ఏర్పాటు చేసింది. హిందూ మతం, సంప్రదాయాలపై విశ్వాసం ఉన్న హిందూ వ్యాపారులు మాత్రమే వాణిజ్యం నిర్వహించడానికి అవకాశం ఉంటుందని బ్యానర్ లో పేర్కొన్నారు.
VHP warning on Christmas celebrations: క్రిస్మస్ వేడుకలపై హిందూ సంస్థ విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) వార్నింగ్ ఇచ్చింది. మధ్యప్రదేశ్ భోపాల్ లోని పాఠశాలలు విద్యార్థులు ఎవరూ కూడా శాంతాక్లాజ్ వేషధారణ ధరించేందుకు అనుమతించకూడదని హెచ్చరించింది. ఇదే విషయంపై భోపాల్ నగరంలోని అన్ని విద్యాలయాలకు వీహెచ్‌పీ లేఖలు రాసింది. సనాతన హిందూ మతం, సంస్కృతిని విశ్వసించే విద్యార్థులను క్రిస్మస్ చెట్లను తీసుకురావానలి.. శాంటాక్లాజ్ దుస్తులు ధరించాలని బలవంతం చేస్తున్నారని ఆరోపించింది.
అగ్నిపథ్ స్కీంకి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పై జరిగిన దాడి కలకలం రేపింది. ఈ విధ్వంసం వెనుక ఉగ్రవాద శక్తుల హస్తం ఉందని ఆరోపించింది విశ్వహిందూ పరిషత్. కోట్లాది రూపాయల రైల్వే ఆస్తుల విధ్వంసాన్ని నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే GRP ( గవర్నమెంట్ రైల్వే పోలీసు ) మరియు రాష్ట్ర ఇంటలిజెన్స్ పూర్తిగా విఫలమైంది. పలు రైళ్లు రద్దయి లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వందల సంఖ్యలో ఉన్న ఆందోళన…
హనుమాన్ జయంతి విజయ యాత్ర రూట్ మ్యాప్ ను పరిశీలించారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్. హనుమాన్ జయంతి ని పురస్కరించుకొని బజరంగ్ దళ్, విహెచ్‌పీల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం చారిత్రాత్మక గౌలిగూడ రాంమందిర్ నుండి నిర్వహించే శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర బైక్ ర్యాలీ రూట్ మ్యాప్ ను నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ పరిశీలించారు. ఆయనతో పాటు అడిషనల్ సీపీ చౌహాన్, కార్తికేయ , జాయింట్ సీపీ రమేష్ రెడ్డి, విశ్వ…