ఆటో మొబైల్, ఎలక్ట్రిక్ రంగాల్లో 4 కోట్లకు పైగా ఉద్యోగాలు ఉన్నాయని తెలిపారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ… ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆయన.. గుంటూరులోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయ 10వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. స్నాతకోత్సవంలో నలుగురికి గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశారు.. భారత బయోటెక్ చైర్మన్ ఎండీ కృష్ణ ఎల్లా, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్, ఆస్ట్రా మైక్రోవేవ్ డైరెక్టర్ ఎంవీ రెడ్డి, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి లకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశారు..…