సూపర్ స్టార్ రజనీకాంత్ అనారోగ్య కారణాలతో చెన్నై అపోలో హాస్పిటల్ లో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. నేడో,రేపో ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ కానున్నారు. కొన్ని రోజులు ఎటువంటి షూటింగ్స్ వంటివి చేయకుండా పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్టు తెలుస్తోంది. మరో వైపు రజనీనటిసున్న సినిమాల పరిస్థితి ఏంటన్న డైలమా నెలకొంది. వినిపిస్తున్న సమాచారం ప్రకారం రజనీ సినిమాలకు ఎటువంటి ఇబ్బంది లేదని తెలుస్తోంది. టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీ నటిస్తున్న చిత్రం…