భారతదేశం గర్వించదగ్గ నటుల్లో దిలీప్ కుమార్ స్థానం ప్రత్యేకమైనది. భారతీయ సినిమా స్వర్ణయుగం చవిచూసిన రోజుల్లో ఎందరో మహానటులు తమదైన అభినయంతో అలరించారు. అలాంటి వారిలో దిలీప్ కుమార్ ఒకరు. ఆ తరం మహానటుల్లో మిగిలివున్న ఏకైక నటుడు ఆయనే! అందుకే అందరూ దిలీప్ కుమార్ ను ‘ద లాస్ట్ థెస్సియన్’ అంటూ కీర్తిస్తారు. ఉత్తరాదిన దిలీప్ కుమార్, రాజ్ కపూర్, దేవానంద్ త్రిమూర్తులు జైత్రయాత్ర సాగిస్తున్న సమయంలో దక్షిణాదిన తెలుగులో యన్టీఆర్ – ఏయన్నార్, తమిళంలో…