నితిన్ హీరోగా, వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాబిన్‌హుడ్’ ఒక హీస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా మార్చి 28న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించింది. రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో, ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ స్పెషల్ కామియోలో కనిపించనున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్ హిట్స్‌గా మారాయి. ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేసింది.…