వినయం, విధేయత, స్వామిభక్తి.. ఇవన్నీ వుంటే ఏదైనా సాధించవచ్చు. వడ్డించేవాడు మనవాడైతే ఫంక్తిలో ఎక్కడ కూర్చున్నా మన విస్తరిలోకి అన్నిరకాల రుచులు వచ్చిపడతాయని మరోసారి నిరూపణ అయింది. పెద్దల సభ అంటే కొందరికి మక్కువ. రాజకీయాల్లో జనంలో తిరగకుండా.. దండాలు పెట్టకుండా హాయిగా అయినవారి ఆశీస్సులు వుంటే హాయిగా పెద్దల సభలో దర్జాగా కాలు పెట్టేయవచ్చు. తెలంగాణ రాజకీయాల్లో సిద్దిపేట కలెక్టర్‌గా పనిచేసి రాజీనామా చేసిన పారుపాటి వెంకట్రామిరెడ్డి గురించి హాట్ టాపిక్ అవుతోంది. ఆయన పదవికి…