కాకాణి గోవర్ధన్ రెడ్డికి రిమాండ్ విధించింది కోర్టు.. కాకాణిని వెంకటగిరి మేజిస్టేట్ ముందు హాజరుపరిచారు పోలీసులు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి వచ్చేనెల తొమ్మిది వరకు రిమాండ్ విధించారు న్యాయమూర్తి.. దీంతో, వెంకటగిరి నుంచి నెల్లూరు సెంట్రల్ జైలుకి కాకాణిని తరలించారు పోలీసులు.
వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు వెంకటగిరి కోర్టులో హాజరుపరిచారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య కాకాణిని జిల్లా పోలీసు ట్రైనింగ్ కాలేజీ నుంచి కోర్టుకు తరలించారు. తొమ్మిది పోలీసు వాహనాల్లో, ప్రత్యేక బలగాల మధ్య వెంకటగిరికి కోర్టుకు తీసుకొచ్చి.. న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఆదివారం బెంగళూరులో కాకాణిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల…