రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో మూడవరోజు శివ కళ్యాణ మహోత్సవాలు జరగనున్నాయి. ఆలయ అర్చకులు స్వామివారికి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. ఆలయ అర్చకులు, జంగమ అర్చకులు కలిసి బలిహరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈనెల మార్చి 27 నుంచి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాలు మార్చి 31 వరకు శివ కళ్యాణోత్సవం వైభవంగా జరిపేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే యాగశాల ప్రాంగణాన్ని సిద్ధం చేశారు.…