అల్లారుముద్దుగా పెంచుకున్న పాప ఒక్కసారిగా అనారోగ్యానికి గురైంది. ఆసుపత్రికి తీసుకెళ్తే బ్లడ్ క్యాన్సర్ అని పరీక్షల్లో తేలడంలో.. తల్లిదండ్రుల జీవితాలు పిడుగుపడినట్టు అయ్యింది.. పాపను రక్షించుకునేందుకు తల్లిదండ్రులు రూ.లక్షలు వెచ్చించారు. విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి రావడంతో పాప చికిత్సకు రూ. 8 లక్షలు మంజూరు చేశారు. అయితే, వ్యాధి ముదరడంతో పాప ప్రాణాలు కోల్పోయింది. ఆమె చికిత్సకు గతంలో చేసిన వ్యయానికి సంబంధించి మరో రూ.7 లక్షలను సీఎంఆర్ఎఫ్ నుంచి విడుదల చేయాలని సీఎం…