మద్రాస్ హైకోర్టు బుధవారం నాడు కీలక తీర్పును వెల్లడించింది. దివంగత సీఎం జయలలిత నివాసం వేద నిలయాన్ని స్మారక మందిరంగా మార్చడానికి వీల్లేదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో గత ప్రభుత్వం(అన్నాడీఎంకే సర్కారు) జారీ చేసిన ఉత్తర్వులను న్యాయస్థానం కొట్టివేసింది. జయలలిత ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేదని కోర్టు వ్యాఖ్యానించింది. మూడు వారాల్లో వేద నిలయాన్ని జయలలిత మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్‌కు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. Read Also:…