‘రెమో, సీమరాజా, శక్తి’ వంటి చిత్రాలతో తమిళ హీరో శివ కార్తికేయన్ తెలుగువారికి చేరువయ్యాడు. అతనితో నెల్సన్ రూపొందించిన ‘వరుణ్ డాక్టర్’ మూవీ తమిళ, తెలుగు భాషల్లో శనివారం జనం ముందుకు వచ్చింది. నాని ‘గ్యాంగ్ లీడర్’, శర్వానంద్ ‘శ్రీకారం’ చిత్రాలలో నటించిన ప్రియాంక అరుల్ మోహన్ ఇందులో హీరోయిన్. వరుణ్ (శివ కార్తికేయన్) ఆర్మీ డాక్టర్. అతనికి పద్మిని (ప్రియాంక అరుల్ మోహన్)తో నిశ్చితార్థం జరుగుతుంది. అయితే ప్రతి విషయంలోనూ ప్రాక్టికల్ గా ఉండే వరుణ్…