కె. విశ్వనాథ్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన ‘స్వాతిముత్యం’ సినిమాను ఎవరూ మర్చిపోలేరు. ఇపుడు అదే టైటిల్ తో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ హీరోగా ఓ సినిమా రూపొందనుంది. బెల్లంకొండ గణేష్ కొత్త సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ విడుదల చేసారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వంలో ఇది రూపొందుతోంది.…
హీరో నాని ఆ మధ్య నిర్మాతగానూ అదృష్టం పరీక్షించుకున్నాడు. ప్రధానంగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ లో నాని సమర్పకుడిగా ప్రశాంతి తిపిర్నేని నిర్మాతగా తెరకెక్కిన ‘అ’, ‘హిట్’ చిత్రాలు అతనికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి, ప్రేక్షకాదరణ సైతం పొందాయి. ‘అ’ మూవీతో ప్రశాంత్ వర్మ, ‘హిట్’తో శైలేష్ కొలను లను దర్శకులుగా పరిచయం చేసిన నాని, ఇప్పుడు తన అక్కయ్య దీప్తి గంటా చేతికి మెగా ఫోన్ ఇచ్చాడు. అయితే… ఇప్పుడు వాల్ పోస్టర్ సినిమా…
మార్చిలో ‘పవర్ ప్లే’ పేరుతో యంగ్ హీరో రాజ్ తరుణ్ ఓ థ్రిల్లర్ జానర్ మూవీ చేశాడు. కానీ అదీ జనాలను మెప్పించలేకపోయింది. ప్రస్తుతం రాజ్ తరుణ్ హీరోగా ‘స్టాండప్ రాహుల్’ అనే సినిమా రూపుదిద్దుకుంటోంది. ‘కూర్చుంది చాలు’ అనేది దీని ట్యాగ్ లైన్. టైటిల్ తోనే ఇంటరెస్ట్ కలిగించిన ఈ సినిమా నుండి సాంటో మోహన్ వీరంకి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే విడుదలై ఆసక్తిని పెంచేసింది. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ ఫేమ్…