మార్చిలో ‘పవర్ ప్లే’ పేరుతో యంగ్ హీరో రాజ్ తరుణ్ ఓ థ్రిల్లర్ జానర్ మూవీ చేశాడు. కానీ అదీ జనాలను మెప్పించలేకపోయింది. ప్రస్తుతం రాజ్ తరుణ్ హీరోగా ‘స్టాండప్ రాహుల్’ అనే సినిమా రూపుదిద్దుకుంటోంది. ‘కూర్చుంది చాలు’ అనేది దీని ట్యాగ్ లైన్. టైటిల్ తోనే ఇంటరెస్ట్ కలిగించిన ఈ సినిమా నుండి సాంటో మోహన్ వీరంకి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే విడుదలై ఆసక్తిని పెంచేసింది. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ ఫేమ్ వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను నందకుమార్ అబ్బినేని – భరత్ మాగులూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ స్వీకర్ అగస్తి సంగీతం అందిస్తున్నాడు. ఇందులో రాజ్ తరుణ్ స్టాండప్ కమెడియన్ గా నటిస్తున్నాడు.
Read Also : సచిన్ కూతురు… బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందా?
తాజాగా ఈ చిత్రం నుంచి “అలా ఇలా” అనే లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. హీరోయిన్ వర్ష బర్త్ డే సందర్భంగా విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ఈ సాంగ్ ను విడుదల చేయించారు. హీరో హీరోయిన్ల మధ్య సాగే ఈ రొమాంటిక్ సాంగ్ ను సత్య యామిని, స్వీకర్ అగస్తి పాడారు. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు. ఈ రొమాంటిక్ సాంగ్ యూత్ ను బాగా ఆకర్షిస్తోంది. మీరు కూడా “అలా ఇలా” లిరికల్ వీడియో సాంగ్ ను వీక్షించండి.