కోలీవుడ్ లో పొంగల్ సందడిని కొంచెం ముందే తెస్తున్నాయి ‘వారిసు’, ‘తునివు’ సినిమాలు. తల అజిత్, దళపతి విజయ్ నటించిన ఈ రెండు సినిమాలపై ట్రేడ్ వర్గాలు భారి లెక్కలు వేస్తున్నాయి. మూడు దశాబ్దాలుగా తమిళనాడులో డెమీ గాడ్ స్టేటస్ అందుకుంటున్న స్టార్ హీరోలు విజయ్, అజిత్ తమ సినిమాలని రిలీజ్ చేసే సమయంలో కోలీవుడ్ లో పండగ వాతావరణం నెలకొంటుంది. అలాంటిది ఈ ఇద్దరు హీరోలు తమ సినిమాలని పండగకే రిలీజ్ చేస్తున్నారు అంటే ఇక…
1990 నుంచి జరుగుతున్న తల అజిత్, దళపతి విజయ్ ల మధ్య బాక్సాఫీస్ వార్ జరుగుతూనే ఉంది. ప్రస్తుతం కోలీవుడ్ లో టాప్ హీరోస్ గా చలామణీ అవుతున్న ఈ ఇద్దరి హీరోల అభిమానుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే అంత వైరం ఉంది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ అనే తేడా లేకుండా మా హీరో గొప్ప అంటే కాదు మా హీరో గొప్ప అంటూ యుద్ధానికి దిగే విజయ్, అజిత్ ఫాన్స్ మరోసారి…
తల అజిత్ సినిమా వస్తుంది అంటే కోలీవుడ్ లో పండగ వాతావరణం ఉంటుంది, అదే అజిత్ సినిమా ఇక పండగకే వస్తుంటే ఫాన్స్ లో జోష్ ఇంకెలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈసారి సంక్రాంతి పండగని మూడు రోజుల ముందే తెస్తూ అజిత్ ‘తునివు’ సినిమాతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. జనవరి 11న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో చిత్ర యూనిట్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే ‘తునివు’ నుంచి ‘చిల్లా చిల్లా’,…
‘తల అజిత్’ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్స్ ఎంటర్టైనర్ ‘తునివు’, తెలుగులో ‘తెగింపు’ పేరుతో డబ్ అవుతోంది. సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ నుంచి ‘చిల్లా చిల్లా’ అనే సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ‘తునివు’ ఆల్బం నుంచి బయటకి వచ్చిన ఈ ఫస్ట్ సాంగ్ ని ‘గిబ్రాన్’ ట్యూన్ కంపోజ్ చేయగా ‘అనిరుద్’ పాడడం విశేషం. అనిరుద్ వాయిస్ ‘చిల్లా చిల్లా’ సాంగ్ కి ప్రాణం పోసింది. అజిత్ అభిమానుల్లో జోష్ నింపిన…
టాలీవుడ్ లో సంక్రాంతి సీజన్ కి మెగా నందమూరి హీరోల మధ్య వార్ జరుగుతుంటే, కోలీవుడ్ లో అజిత్ విజయ్ మధ్య బాక్సాఫీస్ వార్ జరగనుంది. విజయ్ నటిస్తున్న ‘వారిసు’, అజిత్ నటిస్తున్న ‘తునివు’ సినిమాలు పొంగల్ కి ప్రేక్షకుల ముందుకి రానున్నాయి. మాములుగానే అజిత్ ఫాన్స్ కి విజయ్ ఫాన్స్ కి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే అంత రైవల్రీ ఉంది. ఈ హీరోల అభిమానులు ఒకరినొకరు తిట్టుకుంటూ సోషల్ మీడియాలో కూడా గొడవపడుతూ…