గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌పై ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే రాజమౌళి మరియు టీమ్ ఈ ఈవెంట్‌ను అత్యంత గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకలో అభిమానులకు ఇచ్చిన ప్రత్యేక గిఫ్ట్ మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘వారణాసి’ సినిమాకు సంబంధించిన గ్లింప్స్. ఒక్క నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో ప్రారంభం నుంచి చివరి ఫ్రేమ్ వరకు రాజమౌళి విజన్ స్పష్టంగా కనిపించింది. సాధారణ వాణిజ్య సినిమా…