ప్రొద్దుటూరు రాజకీయం హీటెక్కుతుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. తాజాగా.. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మె్ల్యేల మధ్య నువ్వా నేనా అన్నట్లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో.. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మాట్లాడుతూ.. ప్రొద్దుటూరులో రూ.40 కోట్ల విలువైన భూమిని ఎమ్మెల్యే రాచమల్లు ఆక్రమించాలని చూస్తున్నాడని ఆరోపించారు. ఎండోమెంట్ భూమిలో సొంత నిధులతో ఎమ్మెల్యే రాచమల్లు ఎందుకు రోడ్డు వేశాడని దుయ్యబట్టారు.…