(ఆగస్టు 3న కళాభినేత్రి వాణిశ్రీ పుట్టినరోజు) అనితరసాధ్యం, అద్భుతం, అపూర్వం, అనూహ్యం అంటూ పలు ఉపమానాలు వల్లిస్తూ కొందరిని కీర్తించడం కద్దు. అలాంటి అన్ని ఉపమానాలకు సరితూగే ప్రతిభ సొంతం చేసుకున్న నటి వాణిశ్రీ. ఇది కొందరికి అతిశయోక్తి అనిపించవచ్చు. కానీ, ఆమె కెరీర్ గ్రాఫ్ ను చూస్తే మరికొన్ని ఉపమానాలను సైతం జోడించాలనిపిస్తుంది. అదీ వాణిశ్రీ అభినయంలోని ప్రత్యేకత! కొన్ని క్షణాల పాటు వెండితెరపై తళుక్కున మెరిసే పాత్రలో తొలిసారి కనిపించిన వాణిశ్రీ, ఆ తరువాత…