Vichitra Bandham: తెలుగు చిత్రసీమలో అనేక నిర్మాణ సంస్థలు ప్రేక్షకుల మదిలో చెరిగిపోని ముద్రవేశాయి. దుక్కిపాటి మధుసూదనరావు నెలకొల్పిన 'అన్నపూర్ణ' సంస్థ అలా జనం మనసు దోచిన సంస్థనే!
నగుమోము నగ్మా, నగిషీల మహిమ తొలిసారి తెలుగుతెరపై వెలిగింది ‘పెద్దింటల్లుడు’ చిత్రంతో. ఈ సినిమాలోనే ముద్దుగా బొద్దుగా కనిపించిన నగ్మా వచ్చీ రాగానే తెలుగువారిని ఆకర్షించేసింది. సుమన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో మోహన్ బాబు ఓ కీలక పాత్ర పోషించారు. వాణిశ్రీ మరో ముఖ్యభూమికలో అలరించారు. షమ్మీ కపూర్ ‘ప్రొఫెసర్’ చిత్రం పోలికలు ఇందులో కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ఆ చిత్రాన్నే యన్టీఆర్ హీరోగా ‘భలే మాస్టర్’ పేరుతో తెలుగులో తెరకెక్కించారు. కాబట్టి మన తెలుగువారికి ‘పెద్దింటల్లుడు’…