(సెప్టెంబర్ 9న వందేమాతరం శ్రీనివాస్ పుట్టినరోజు)పాటను ఇంటిపేరుగా మార్చుకున్న గాయకుడు వందేమాతరం శ్రీనివాస్. స్వరకల్పనతోనూ సంబరాలు చేసుకున్న ఘనుడు వందేమాతరం. ఒకప్పుడు లో బడ్జెట్ మూవీస్ కు కంచుకోట లాంటి సంగీత దర్శకుడు శ్రీనివాస్. ఇక ఎరుపు రంగు పులుముకున్న చిత్రాలకు వందేమాతరం తప్ప వేరే దారి కనిపించేది కాదు. వరుసగా రెడ్ మార్క్ సినిమాలకు సంగీతం సమకూర్చినా వైవిధ్యంతో చిందులేయించేవారు శ్రీనివాస్. ఆరు నందులు ఆయన ప్రతిభకు పట్టం కట్టాయి. గాయకునిగా మూడు సార్లు, సంగీత…