వనపర్తి జిల్లా మదనాపురంలో విషాదం చోటుచేసుకుంది. ఎగువన సరళ సాగర్ ప్రాజెక్ట్ ఆటోమేటిక్ సైఫన్స్ తెరుచుకోవడంతో కాజ్ వే పై నుంచి నీరు ప్రవహిస్తుంది. నదిపై నిర్మించిన లోలెవల్ బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండగా ద్విచక్ర వాహనంపై ఇద్దరు మహిళలతో వస్తున్న వ్యక్తి కాజ్ వే దాటుతుండగా.. అదుపు తప్పి బైక్‌తో సహా నదిలో పడిపోయాడు. ప్రవాహం ఎక్కువగా ఉండటంతో.. ముగ్గురు కొట్టుకుపోతున్నారు.