ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరులో ప్రమాదం జరిగింది. జి.కొండూరులోని పెట్రోల్ బంకు వద్ద వ్యాన్ టైర్లు పేలి వాహనం పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటనలో కలకోటి ప్రవీణ్ (36) అనే వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.
రాజన్నసిరిసిల్ల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెండ్లికి వెళ్లివస్తున్న ఓ వ్యాన్ బోల్తా కొట్టింది. చందుర్తి మండలం ఎనగంటి గ్రామ శివారులో పెండ్లి వ్యాన్ బోల్తా ఘటన చోటు చేసుకుంది. హన్మాజీపేటలో పెళ్లికి వెళ్లి అనంతరం తిరుగు ప్రయాణం లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం జరినప్పుడు వ్యాన్ లో 40 మంది ఉన్నట్లు సమాచారం. ఈ…