సీనియర్ దర్శకులు వంశీ... పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ తాజాచిత్రానికి పాటలు రాస్తున్నారు. ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా పోలవరంలో ప్రారంభమైంది.
ప్రముఖ దర్శకులు వంశీ రూపొందించిన ‘ఏప్రిల్ 1 విడుదల’ సినిమా అప్పట్లో విశేషాదరణ పొందింది. దాంతో ఆ పేరును చాలా మంది చాలా రకాలుగా వాడేసుకున్నారు. విశేషం ఏమంటే… దర్శకులు వంశీ బేసికల్ గా మంచి రచయిత. తెలుగు సాహితీ రంగంలో వంశీకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. తాను రాసిన నవలలనే ఆయన సినిమాలుగానూ తీశారు. అలానే ఇప్పటికే వంశీ పలు నవలలు, కథా సంపుటాలను వెలువరించారు. గత కొంతకాలంగా దర్శకత్వానికి దూరంగా ఉంటున్న వంశీ……