Vallabhaneni Vamsi: వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది. బెజవాడ మాచవరం పోలీసులు వంశీపై హత్య యత్నం కేసు నమోదు చేశారు. నూతక్కి సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో వంశీ పై కేసు నమోదైంది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని వంశీ దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. వంశీని అరెస్టు చేయవద్దని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.…