భారత రాష్ట్రపతి పదవి అనేది ఎంతో కీలకం. దేశం మొత్తం పరిపాలన అంతా రాష్ట్రపతి పేరుమీదే కొనసాగుతుంది. భారత రాజ్యాంగంలో రాష్ట్రపతికి చాలా ప్రాముఖ్యతను ఇచ్చింది. నిజానికి భారత ప్రభుత్వానికి అధిపతి రాష్ట్రపతే అయినా.. వాస్తవంగా అధికారం చెలాయించేది ప్రధాని సారథ్యంలోని మంత్రి మండలి. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం రాష్ట్రపతికి విశేష అధికారాలను కల్పించింది భారత రాజ్యాంగం. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో భారత రాష్ట్రపతికి విశేష అధికారాలు ఉంటాయి. రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ కూడా సాధారణం…