గౌరవ సభల పేరుతో టీడీపీ రాష్ట్రవ్యాప్త ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేసింది. ఇంట్లో ఆడవాళ్లని కూడా చట్టసభల్లో దూషిస్తూ కౌరవ సభలుగా మారుస్తున్నారని ఆరోపిస్తూ ప్రజల్లోకి వెళ్లాలన్నది ప్రణాళిక. అయితే ఈ వివాదానికి మూల కారణమైన వల్లభనేని వంశీ.. క్షమాపణలు చెప్పేశారు. అయినప్పటికీ ఆ కామెంట్సే అజెండాగా గౌరవ సభలు నడపాలా.. ఆగాలా..? అన్నది ప్రస్తుతం టీడీపీలో జరుగుతున్న చర్చ. వంశీ క్షమాపణలు తర్వాత టీడీపీ డైలమాలో పడ్డట్టుగానే కన్పిస్తోంది. ఏపీలో గౌరవ సభలు నిర్వహించాలని టీడీపీ…