Chinmayi Sripaada: ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో తమిళ పాటల రచయిత వైరముత్తుపై ఆమె లైంగిక ఆరోపణలు చేశారు. తనను వేధించినట్లు చిన్మయి ఆరోపించింది. ఇదిలా ఉంటే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, కాంగ్రెస్ నేత పి. చిదంబరం, ప్రముఖ నటుడు కమల్ హాసన్‌తో కలిసి వైరముత్తు ఒకే వేదికను పంచుకోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి సంబంధించిన ఫోటోను సోమవారం ట్వీట్ చేసిన చిన్మయి తీవ్ర స్థాయిలో స్పందించారు.
Annamalai: భారత రెజ్లర్ల సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ సింగ్ పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే ఆ పదవి నుంచి ఆయన్ను తొలగించడమే కాకుండా.. అరెస్ట్ చేయాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఆదివారం కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ సందర్భంగా రెజ్లర్లు వారి మద్దతుదారులు కొత్త పార్లమెంట్ వైపు ర్యాలీగా వెళ్లి ఆందోళన నిర్వహించాలని అనుకున్నారు. దీంతో రెజ్లర్లను పోలీసులు అడ్డుకున్నారు.
మణిరత్నం తాజా చిత్రం ‘పొన్నియన్ సెల్వం’. ఇది రెండు భాగాలుగా రాబోతోంది. తొలిభాగం 2022 వేసవికి విడుదల కానుంది. ఈ పీరియాడిక్ డ్రామా లో విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యారాయ్, త్రిష, ఐశ్వర్యలక్ష్మి, శరత్ కుమార్ ప్రధాన తారాగణం. ఇక ఈ సినిమాకు మణి ఆస్థాన సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే మణితో దశాబ్దాల అనుబంధం ఉన్న గేయరచయిత వైరముత్తు ఈ చిత్రానికి పని చేయటం లేదు. దీనికి కారణం అతడిపై వచ్చిన…
కోలీవుడ్ లో సీనియర్ లిరిసిస్ట్, అద్భుతమైన కవి అయిన వైరముత్తు మరోసారి నెటిజన్స్ నోళ్లలో నానాడు. అబ్బే! ఈసారి ఏ చిన్మయి లాంటి అమ్మాయో ఆయన పేరు మీద లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలు చేయలేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ కోసం వైరముత్తు ఓ అందమైన సందేశం సొషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తమిళంలో ఆయన రాసిన ట్వీట్ ఇప్పుడు నెటిజన్స్ లో చర్చగా మారింది…కొన్నాళ్ల క్రితం ‘అన్నాత్తే’ షూటింగ్ హైద్రాబాద్ లో జరుగుతుండగా తలైవా ఆరోగ్యం…
ప్రముఖ గీత రచయిత, పద్మ భూషణ్ అవార్డు గ్రహీత వైరముత్తు మరోసారి వార్తల్లో నానుతున్నాడు. ఇటీవల కేరళకు చెందిన ఓఎన్వి లిటరరీ అవార్డుకు ఆయనను ఎంపిక చేశారు. దాంతో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సహా పలువురు ఆయన్ని అభినందనలతో ముంచెత్తారు. ఇదే సమయంలో మీటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వైరముత్తుకు ఈ అవార్డును ప్రకటించడం పట్ల గాయని చిన్మయితో పాటు కొందరు మహిళలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదం సోషల్ మీడియాలో అగ్గిని రాజేయడంతో జ్యూరీ మెంబర్స్…
ఆయన పేరే వైరముత్తు. అందుకేనేమో చాలా మందికి అతడితో వైరం ఏర్పడింది. అఫ్ కోర్స్, ఆయన మీద వచ్చిన ఆరోపణలు కూడా అంతే సీరియస్ లెండీ! తమిళ గీత రచయిత వైరముత్తు వివాదం గురించి కొత్తగా చెప్పేదేముంది? ఆయనపై సింగర్ చిన్మయి శ్రీపాద లైంగిక ఆరోపణలతో ‘మీ టూ’ వ్యవహారం మొదలైంది. తరువాత దాదాపు 16 మంది మహిళలు వైరముత్తుపై లైంగిక వేధింపు ఆరోపణలు చేశారు. అయితే, అవేవీ ఆయన్ని జైలుకో, కోర్టుకో తీసుకెళ్లలేకపోయాయి. కానీ, వైరముత్తు…