Fake Ornaments: వైకుంఠ ఏకాదశి వేళ శ్రీ వేంకటేశ్వర స్వామికి నకిలీ ఆభరణాల వ్యవహారం కలకలం సృష్టించింది.. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం మద్దూరులోని ప్రసిద్ధ వెంకటేశ్వరస్వామి ఆలయంలో నకిలీ వెండి ఆభరణాల వ్యవహారం కలకలం రేపింది. వైకుంఠ ఏకాదశి పర్వదినం (సోమవారం) రోజున స్వామివారికి అలంకరణ కోసం నగలను తీసి పరిశీలించగా, అసలు వెండి ఆభరణాల స్థానంలో నకిలీ వెండి నగలు కనిపించడంతో ఈ బాగోతం బయటపడింది. ఆలయానికి దాతలు సమర్పించిన కిరీటం, హస్తాలు, చక్రం,…