ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో అతిపిన్న వయసులో హాఫ్ సెంచరీ బాదిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 14 సంవత్సరాల 32 రోజుల వయసులో వైభవ్ అర్ధ సెంచరీ బాదాడు. ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్.. 17 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. 17 బంతుల్లో 6 సిక్సులు, 3 ఫోర్లతో అర్ధ శతకం చేశాడు.…