చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే బౌలింగ్ ఎంచుకున్నాడు. బరిలోకి దిగిన చెన్నై కుప్పకూలింది. 20 ఓవర్లలో చెన్నై సూపర్ కింగ్స్ 9 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ ముందు 104 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది.
చెన్నై సూపర్‌కింగ్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మరో యువ ఆటగాడు వెలుగులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌తో పంజాబ్ తరఫున ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన వైభవ్ అరోరా అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా బౌలింగ్‌లో తన స్వింగ్‌తో చెన్నై టాప్ ఆర్డర్‌ను వణికించాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన అరోరా 21 పరుగులు ఇచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న చెన్నై ఆటగాళ్లు రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీలను పెవిలియన్…