కరోనాపై పోరాటంలో దేశం మైలురాయిని అధిగమించింది. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా.. 100 కోట్ల డోసుల్ని దేశం దాటేసింది. ఎన్నో అవాంతరాలను దాటుకుని వాక్సినేషన్ ప్రక్రియలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. ఈ ఘనతకు కారకులైన ప్రధాన మంత్రి మోడీకి ధన్యవాదాలు అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ మేరకు పవన్ వీడియో విడుదల చేశారు. కోవిడ్ వాక్సినేషన్ ప్రక్రియ 100 కోట్ల డోసుల మార్క్ దాటడం ప్రతి ఒక్కరం హర్షించాల్సిన మైలు రాయి. ప్రధాన మంత్రి నరేంద్ర…
భారతదేశం వందకోట్ల టీకాల మైలురాయిని దాటి ఒక సరికొత్త చరిత్రను ఈరోజు సృష్టించింది. ఈ సందర్భంగా కోవిడ్ యోధులందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు.మహమ్మారి పై పోరాటం లో భాగంగా వందకోట్ల టీకా డోసులు అందించి భారతదేశాన్ని సగర్వంగా నిలిపిన సైంటిస్టులకు, టీకా తయారీదారులకు సెల్యూట్ అంటూ తెలంగాణ గవర్నర్ డా.తమిళసై సౌందరరాజన్ ట్వీట్ చేశారు. భారతీయురాలిగా ఈ ఘనత సాధించినందుకు గర్వపడుతున్నాను. 100 కోట్ల టీకా డోస్ లు పంపిణీ మార్క్ ని చేరడం సంతోషంగా ఉంది.…